Jharkhand Crisis : జార్ఖండ్ లో కొనసాగుతున్న సస్పెన్స్
గవర్నర్ ను కలవనున్న అఖిలపక్షం
Jharkhand Crisis : నిన్న మహారాష్ట్ర నేడు జార్ఖండ్ లో ఆపరేషన్ కమలం వర్కవుట్ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తనంతకు తానుగా మైన్స్ ను దక్కించు కున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పూర్తిగా వివరణ కోరారు. ఇందులో భాగంగా సీఈసీ లైన్ క్లియర్ ఇచ్చింది. దీంతో వెంటనే గవర్నర్ సీఎం సోరేన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆరు నెలల కాలం పాటు సీఎంలో ఉంటారు సోరేన్. అంత లోపు తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది.
ఈ తరుణంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఓ వైపు తన ఎమ్మెల్యేలను తరలించారు సోరేన్. మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎలా
కూల్చాలనే దానిపై ఫోకస్ పెట్టిందంటూ సంచలన ఆరోపణలు చేశారు జార్ఖండ్ సీఎం.
ప్రస్తుతం జార్ఖండ్ లో ఏం జరుగుతుందోనన్న(Jharkhand Crisis) ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ రమేశ్ బయాస్ ను సోరేన్ నేతృత్వంలోని కూటమి కలవనుంది.
ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలో. ఈ మేరకు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే సీఎం హేమంత్ సోరేన్ రమేష్ బయాస్ కు ఫోన్ చేశారని తమ బలాన్ని నిరూపించు కునేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు టాక్.
Also Read : రోజుకు 86 రేప్ లు గంటకు 49 నేరాలు