MLC Kavitha ED : కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ
బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఉత్కంఠ
Liquor Scam MLC Kavitha ED : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 11న స్కాంకు సంబంధించి ఈడీ ముందు విచారణకు హాజరైంది. ఉదయం 11 గంటలకు వెళ్లిన కల్వకుంట్ల కవిత( MLC Kavitha ED) రాత్రి 8.05 గంటలకు బయటకు వచ్చింది.
మొదట ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లే ముందు కవిత పిడికిలి బిగించింది. ఆ తర్వాత విచారణ అనంతరం వచ్చిన ఆమె నవ్వుతూ తిరిగి కేసీఆర్ భవన్ కు వచ్చింది. ఆమెకు హారతితో స్వాగతం పలికారు. ఆరోజు రాత్రే హుటా హుటిన హైదరాబాద్ కు వచ్చారు. కల్వకుంట్ల కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు , శ్రీనివాస్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు తిరిగి వచ్చారు.
తనకు చట్టం పట్ల గౌరవం ఉందని, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Liquor Scam MLC Kavitha ED) . ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు కవిత ను కలిపి విచారించనుంది ఈడీ.
ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో ఎమ్మెల్సీ కవిత భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ లో ఈడీపై, కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. తనను వేధింపులకు గురి చేశారని, తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత ఫోన్ ను తీసుకున్నారని, రాత్రి వరకు విచారణ చేపట్టడం చట్టానికి విరుద్దమంటూ పేర్కొన్నారు. స్టే ఇవ్వాలని కోరింది . దీనిపై కోర్టు షాక్ ఇచ్చింది. స్టే ఇవ్వడానికి కుదరదని స్పష్టం చేసింది.
Also Read : మోడీ..ఈడీ జాన్తా నై – కేటీఆర్