Aaditya Thackeray : పార్టీ సింబల్ నిలిపివేత ఓ కుట్ర – ఆదిత్యా
ఇదంతా ద్రోహుల పనేననంటూ కామెఎంట్
Aaditya Thackeray : మాజీ మంత్రి, శివసేన యువ నాయకుడు ఆదిత్యా ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. శివసేన పార్టీ ఎవరిదనే దానిపై శివసేన పార్టీ చీఫ్ ఆదిత్యా ఠాక్రే, శివసేన తిరుగుబాటు నాయకుడు, ప్రస్తుత మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండేలు కోర్టుకు ఎక్కారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆపై ఇరు వర్గాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అదేమిటంటే రెండు వర్గాలుగా విడిపోయిన వారెవరూ శివసేన పార్టీకి సంబంధించి గుర్తు, బాణంను వాడడానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శివసేన పార్టీ ఉన్నా లేనట్టుగానే మారి పోయింది.
అంతే కాకుండా తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో రెండు వర్గాలకు చెందిన వారు ఎవరూ శివసేన పార్టీని , గుర్తును వాడ కూడదంటూ స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆదిత్యా ఠాక్రే. పార్టీ సింబల్ పై ఈసీ చేసిన కామెంట్స్, ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయంటూ పేర్కొన్నారు.
ఇదంతా శివసేన పార్టీకి ద్రోహం తలపెట్టిన వారు పన్నిన పన్నాగం, కుట్రలో భాగమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నీచాతి నీచమైన చర్యలను మహారాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించ బోరంటూ హెచ్చరించారు. శివసేన అంటేనే బాల్ ఠాక్రే. ఆయనకు వారసులు షిండే కాదు.
బీజేపీ ఎన్నటికీ కాబోదన్నారు ఆదిత్యా ఠాక్రే. మేమంతా నిజం వైపు ఉన్నామని ఎప్పటికైనా తామే గెలుస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి. షిండే వర్గం స్వచ్చందంగా పార్టీని వీడారని వారికి పార్టీని వాడుకునే హక్కు లేదంటూ కోర్టుకు తెలిపింది ఆదిత్యా ఠాక్రే వర్గం.
Also Read : ఉద్దవ్ ఠాక్రే..ఏక్ నాథ్ షిండేకు ఈసీ షాక్