Suvendu Adhikari : గంగూలీని బ్రాండ్ అంబాసిడర్ చేయి
సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారి
Suvendu Adhikari : బీసీసీఐ చీఫ్ గా ఇవాల్టితో తన పదవీ కాలం పూర్తి అవుతుంది బెంగాల్ కు చెందిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ మాజీ క్రికెటర్ కు ఎనలేని ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా మూడు సంవత్సరాల పాటు గంగూలీ(Sourav Ganguly) బీసీసీఐ బాస్ గా ఉన్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే అతడు వచ్చాక బీసీసీఐకి కొత్త కళను తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఇది పక్కన పెడితే కొత్త కార్యవర్గం బీసీసీఐకి అక్టోబర్ 18న ఎన్నిక కానుంది. తాను మళ్లీ బీసీసీఐకి చీఫ్ కావాలని కలలు కన్నాడు. ఇక అక్కడి నుంచి కాదనుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పదవికి చైర్మన్ కోసం పోటీ చేయాలని భావించాడు.
కానీ ఊహించని రీతిలో ఏమైందో ఏమో కానీ బీసీసీఐలో ఆయనకు మద్దతు లభించ లేదని ప్రచారం జరిగింది. ఆయన స్థానంలో కర్ణాటకకు చెందిన మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ బాస్ కానున్నాడు. ఇదంతా పక్కన పెడితే గంగూలీ బీసీసీఐ పదవి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
సత్తా చాటినా కావాలని బీజేపీ పక్కన పెట్టిందని, అవమానించిందంటూ టీఎంసీ ఆరోపించింది. సోమమారం బెంగాల్ సీఎం ఐసీసీకి గంగూలీని పంపించాలంటూ పీఎం మోదీకి లేఖ రాయడం కలకలం రేపింది. దీనిని తప్పు పట్టారు బీజేపీ అగ్ర నాయకుడు సువేందు అధికారి(Suvendu Adhikari) . అంత ప్రేమ గనుక ఉంటే సౌరవ్ గంగూలీని బెంగాల్ కు బ్రాండ్ అంబాసిడర్ చేయి అంటూ హితవు పలికాడు.
Also Read : తిప్పేసిన షమీ తలవంచిన ఆసిస్