Swapan Das Gupta : స‌ర్కార్ అండ‌తోనే ఖాకీల వీరంగం

బీజేపీ నేత‌ స్వ‌ప‌న్ దాస్ గుప్తా ఆగ్రహం

Swapan Das Gupta : కోల్ క‌తాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న ర‌ణ‌రంగంగా మారింది. బీజేపీ శ్రేణులు, పోలీసుల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

టియ‌ర్ గ్యాస్, వాట‌ర్ క్యాన‌న్లు ప్ర‌యోగించాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌నపై వెంట‌నే నివేదిక ఇవ్వాల్సిందిగా కోల్ క‌తా హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ఎవ‌రినీ నిర్బంధించ వ‌ద్ద‌ని సూచించింది. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కాపాడాల‌ని కోరింది. ఇదే ఘ‌ట‌న‌లో పోలీసు వాహ‌నం త‌గుల బెట్ట‌గా ప‌లువురి నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేష‌న్ ల‌కు త‌ర‌లించారు. మ‌రో వైపు రాళ్లు రువ్వ‌డంతో ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ పై బీజేపీ అగ్ర నాయ‌కుడు స్వ‌ప‌న్ దాస్ గుప్తా సీరియ‌స్ అయ్యారు.

సీఎం దీదీ(Mamata Banerjee) అండ‌తోనే పోలీసులు రెచ్చి పోయార‌ని ఆరోపించారు. నిర‌స‌న‌, ఆందోళ‌న చేప‌ట్ట‌డం ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు. కానీ వామ‌ప‌క్షాల‌కు ప‌ర్మిష‌న్ ఇస్తున్న సీఎం బీజేపీకి మాత్రం ఇవ్వ‌డం లేదంటూ మండిప‌డ్డారు.

ప్ర‌ధానంగా ఖాకీలు అస‌మాన బ‌ల‌గాల‌ను ప్ర‌యోగించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు స్వ‌ప‌న్ దాస్ గుప్తా(Swapan Das Gupta). పోలీసులు హ‌ద్దులు దాటి ఎంత‌గా దాడుల‌కు దిగినా మా పార్టీ నాయ‌కులు కానీ కార్య‌క‌ర్త‌లు కానీ ఎక్క‌డా వ్య‌తిరేకించ లేద‌ని చెప్పారు.

కానీ ఖాకీలే కావాల‌ని రెచ్చ‌గొట్టేలా చేశారంటూ ఆరోపించారు. దీంతో రాష్ట్ర రాజ‌ధాని కోల్ క‌తా ర‌ణ‌రంగంగా మారింద‌న్నారు. దీనికి కార‌ణం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మేనంటూ నిందించారు స్వ‌ప‌న్ దాస్ గుప్తా. ప్ర‌జాస్వామ్యానికి ఇది విచార‌క‌ర‌మైన రోజుగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

Also Read : మ‌నుస్మృతిలో శూద్రుల‌కు అవ‌మానం

Leave A Reply

Your Email Id will not be published!