Swati Maliwal : బ్రిజ్ భూషణ్ మాటేంటి – స్వాతి మలివాల్
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై ఫైర్
Swati Maliwal : ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్(Swati Maliwal) సీరియస్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా గురువారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీని తప్పు పట్టారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ తనకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడంటూ ఆరోపించారు సరే..కానీ తమ పార్టీకి చెందిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సాక్షాత్తు మహిళా రెజ్లర్లు తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని రోడ్డెక్కినా ఎందుకు మీరు ప్రశ్నించ లేదని నిలదీశారు స్వాతి మలివాల్.
Swati Maliwal Asking Smriti Irani
ఆనాటి నుంచి నేటి వరకు మీ నోరు ఎందుకు తెరుచు కోలేదని మండిపడ్డారు. ఒకరికి ఒక న్యాయం మరొకరికి ఇంకో న్యాయం అనేది ఉంటుందా అని ప్రశ్నించారు. మీరు కూర్చున్న రెండు వరుసల వెనుకనే దర్జాగా బ్రిజ్ భూషణ్ శరణ్ కూర్చున్నాడని, మరి ఆయనను ఎందుకని నిలదీయ లేక పోయారని ఆలోచించారా అని మండిపడ్డారు స్వాతి మలివాల్.
ఒకరిపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు . ఒలింయిన్ రెజ్లర్లను గది లోకి పిలవడమే కాకుండా, ఛాతిపై చేయి వేశాడని, నడుముపై గిల్లాడని నెత్తీ నోరు మొత్తుకున్నా ఎందుకని నిలదీయడం లేదంటూ ఫైర్ అయ్యారు స్వాతి మలివాల్.
Also Read : Rahul Gandhi : రాహుల్ గాంధీ అలాంటోడు కాదు