Taiwan China Row : చైనా సైనిక విన్యాసం తైవాన్ ఆగ్రహం
మరింత దూకుడు పెంచిన డ్రాగన్
Taiwan China Row : అమెరికా చేసిన నిర్వాకానికి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తైవాన్ కు. ఆ భూభాగం తమదేనంటోంది డ్రాగన్ చైనా. ప్రపంచానికి కూడా ముందే హెచ్చరికలు జారీ చేసింది.
తమ పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్లినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కానీ అమెరికా ఊరుకుంటుందా తగదునమ్మా అంటూ తైవాన్ లో కాలు మోపింది. చైనాను గెలికింది.
ఇంకేం ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ సీరియస్ అయ్యాడు. ఆపై తైవాన్ పై ఆంక్షలు విధించాడు. బలగాలను మోహరించాడు. ఆపై తైవాన్ చుట్టూ అష్టదిగ్బంధనం ఉండేలా చేశాడు.
మరో వైపు సైనిక విన్యాసాలు ఊపందుకున్నాయి. కేవలం ఆ దేశం చుట్టూ 20 కిలోమీటర్ల దూరంలో బాలిస్టిక్ క్షిపణులను మోహరించింది.
ఇప్పుడో అప్పుడో యుద్దం ప్రకటించేందుకు సిద్దంగా ఉంది చైనా. ఇదే సమయంలో భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది డ్రాగన్. శ్రీలంకను అడ్డం పెట్టుకుని తన దేశానికి చెందిన నౌకను దించుతోంది.
అది ఇప్పటికే బయలు దేరింది. దీని వల్ల భారత్ లో రక్షణ వ్యవస్థ ఎలా ఉందనే దానిపై ఆ నౌక స్కాన్ చేస్తుందన్నమాట. ఇదిలా ఉండగా తాము యుద్దం కోరు కోవడం లేదని, స్నేహం కోసం వచ్చానని స్పష్టం చేసింది అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ.
ఆమె పర్యటనతో తైవాన్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు తైవాన్ తాము ఊరుకోబమని చైనాతో తాడో పేడో తేల్చుకుంటామంటోంది. సైనిక విన్యాసాలతో చైనా ఏకపక్షంగా(Taiwan China Row) నాశనం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Also Read : లంకలో చైనా నౌక..భారత్ ఆందోళన