Tailor Killers Attacaked : టైలర్ కిల్లర్స్ పై దాడికి యత్నం
కోర్టు ఆవరణలో సంఘటన
Tailor Killers Attacaked : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ దారుణ హత్య. ప్రవక్త మహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నామని దుండగులు ప్రకటించారు.
ఆపై వీడియో కూడా తీశారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి నిందితులను(Tailor Killers Attacaked) పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
శనివారం హంతకులను జైపూర్ కోర్టులో పోలీసులు కస్టడీకి తీసుకు వెళుతుండగా లాయర్లతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వారిని తీసుకు వెళ్లడం చాలా కష్టంగా మారింది.
పోలీసులు కూడా ఏమీ చేయలేక పోయారు. ఇదిలా ఉండగా ఇవాళ భారీ పోలీసు బందోబస్తు మధ్య జైపూర్ లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టులో దాడికి పాల్పడిన వారిని, వారి ఇద్దరు సహచరులను హాజరు పరిచారు.
ఆ నలుగురిని 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి పంపారు. సస్పెండ్ చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు గాను టైలర్ కన్హయ్య లాల్ ను అతని దుకాణంలో హత్య చేశారు.
కొన్ని గంటల తర్వాత రియాజ్ అక్తరీ, గౌస్ మహ్మద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో పోస్ట్ చేసిన వీడియోలో వాడిన కత్తులను కూడా చూపించారు.
ఆపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా చంపుతామని బెదిరించారు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read : మర్డర్ చేసినోళ్లకు మర్యాద చేస్తారా
Udaipur Tailor Kanhaiya Lal Killers Attacked At Court, Clothes Ripped
Video: @ANI #Udaipur #UdaipurMurder #JaipurCourt#NupurSharama#SupremeCourtOfIndia#MohammedZubair pic.twitter.com/RA8O9QTt6L
— Das Vanthala (@DasVanthala) July 2, 2022