Tajinder Bagga : పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న భారతీయ జనతా పార్టీ నేత తజీందర్ సింగ్ బగ్గా(Tajinder Bagga) తిరిగి తన స్వంత ఇల్లు ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన నిర్బంధం చట్ట వ్యతిరేకమని ఆరోపించాడు.
ఈ మేరకు ఢిల్లీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కశ్మరీ పండిట్లపై సీఎం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తన ఆందోళన కొనసాగుతూనే ఉంటుందన్నారు బగ్గా.
అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పేంత వరకు తాను పోరాడుతానని,ఇక ఆప బోనంటూ స్పష్టం చేశాడు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై తజీందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చేసుకున్నాయి. హర్యానా పోలీసులు బగ్గాను పంజాబ్ కు వెళ్లకుండా అడ్డుకున్నారు. తిరిగి ఢిల్లీకి చేరుకోవడంతో విజయ చిహ్నం ఎగుర వేశాడు.
పంజాబ్ పోలీస్ కస్టడీ నుండి విడుదలైన తర్వాత మిస్టర్ బగ్గాను ఢిల్లీకి తీసుకు వచ్చారు. ద్వారాక లోని కోర్టు ముందు హాజరు పరిచారు. దాంతో డ్యూటీ మేజిస్ట్రేట్ తజీందర్ సింగ్ బగ్గాకు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు.
బగ్గా తరపున హాజరైన న్యాయవాదులు వైపీ సింగ్ , సంకేత్ గుప్తా గుప్తా వీపు మీద , భుజంపై గాయాలైనట్లు కోర్టుకు విన్నవించారు. బగ్గా వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు.
బగ్గా అరెస్ట్ వ్యవహారం మొత్తం 20 గంటల పాటు కొనసాగింది. అర్దరాత్రి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా బగ్గాకు స్వీట్లు తినిపించాడు.
Also Read : కేంద్ర సర్కార్ పై అఖిల్ గొగోయ్ కన్నెర్ర