Tajinder Bagga : తజిందర్ బగ్గాను అరెస్ట్ చేయొద్దు
పంజాబ్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం
Tajinder Bagga : ఢిల్లీ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు తజిందర్ సింగ్ పాల్ బగ్గా కు(Tajinder Bagga) ఊరట లభించింది. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంత వరకు బగ్గా జోలికి వెళ్లవద్దంటూ స్పష్టం చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను వ్యక్తిగత దూషణలకు దిగారంటూ పంజాబ్ పోలీసులు నానా హై డ్రామా మధ్య అరెస్ట్ చేశారు.
అతడిని పంజాబ్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. బగ్గా అరెస్ట్ పై అనుమానం ఉందని, ఆయన కిడ్నాప్ చేసినట్లు గా అనిపిస్తోందంటూ నిలిపి వేశారు.
ఢిల్లీ పోలీసులు అతడిని ఢిల్లీకి చేర్చారు. ఉన్నట్టుండి మొహాలీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది తజీందర్ సింగ్ పాల్ బగ్గాకు(Tajinder Bagga). ఈ మేరకు అత్యవసరంగా శనివారం అర్ధరాత్రి బగ్గాకు సంబంధించిన పిటిషన్ పై విచారణ కు స్వీకరించింది.
తుది తీర్పు వెలువరించేంత వరకు బగ్గాను అరెస్ట్ చేయవద్దంటూ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై రెచ్చగొట్టేలా, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడంటూ పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనికి సంబంధించి పంజాబ్ లోని మొహాలీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రెచ్చొట్టే వ్యాఖ్యలు చేయడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేర పూరితంగా బెదిరింపులకు పాల్పడడంపై తజీందర్ సింగ్ పాల్ బగ్గాపై(Tajinder Bagga) కేసు నమోదు చేశారు.
Also Read : కర్ణాటక సీఎం పోస్టు విలువ 2,500 కోట్లు