Taliban Al Zawahiri : కనిపించని అల్ జవహిరి ఆనవాళ్లు
తాలిబన్ల సంచలన ప్రకటన కలకలం
Taliban Al Zawahiri : వరల్డ్ మోస్ట్ టెర్రరిరస్ట్ గా పేరొందిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ అల్ జవహిరిని(Taliban Al Zawahiri) తాము హత మార్చినట్లు అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ప్రకటించారు.
యావత్ ప్రపంచం ఆయన చేసిన ప్రకటన విస్తు పోయేలా చేసింది. ఇదే విషయంపై ఆఫ్గనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబన్ల అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు.
ఎందుకంటే జవహిరి స్థావరం ఏర్పాటు చేసుకుంది ఎక్కడో కాదు ఆఫ్గనిస్తాన్ దేశ రాజధాని కాబూల్ లో. విచిత్రం ఏమిటంటే ఇదే తాలిబన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అల్ ఖైదా చీఫ్ జవహిరి మృతిపై.
ఆయన చని పోలేదని. అందుకు సంబంధించిన ఆనవాళ్లు తమకు అందలేదని పేర్కొన్నారు. జవహిరీ మృతి చెంద లేదంటూ తాజాగా ప్రకటించారు.
ప్రస్తుతం వారు చేసిన ఈ ప్రకటన కలకలం రేపుతోంది. జవహిరి చని పోయినట్లు పక్కా ఆధారాలు తమకు ఇంకా లభించ లేదని స్పష్టం చేసింది ఆఫ్గన్ సర్కార్.
అయితే జవహిరి మరణించాడా లేదా అన్న దానిపై విచారణ ప్రారంభించామని వెల్లడించింది. మరో వైపు కాబూల్ లో డ్రోన్ దాడి జరిగిందని, ఇందులో అల్ జవహిరిని ఖతం చేశామని సాక్షాత్తు యుఎస్ చీఫ్ ప్రకటించారు.
సామాన్యంగా వేరే ఎవరైనా ఈ ప్రకటన చేసినా నమ్మే వారు కాదు. ప్రపంచంలో టాప్ లో ఉన్న కంట్రీ ఈ ప్రకటన చేయడం సామాన్యమైన విషయం కాదు.
సాక్షాత్తు అధ్యక్షుడే ప్రకటించాక అనుమానం ఎందుకుంటుంది. అతడికి సంబంధించి డీఎన్ ఏ ఆధారాలు లేవని పేర్కొంది. ఇద్దరి ప్రకటనలతో జవహిరి ఎక్కడ ఉన్నాడనేది మిస్టరీగా మారింది మరోసారి.
Also Read : చైనా దూకుడుపై తైవాన్ కన్నెర్ర