Taliban Urges Hindus Sikhs : భ‌ద్ర‌త క‌ల్పిస్తాం మా దేశానికి రండి

హిందువులు, సిక్కుల‌కు తాలిబ‌న్ల విన్న‌పం

Taliban Urges Hindus Sikhs : ఆఫ్గ‌నిస్తాన్ లో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయ‌ని ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తాలిబ‌న్ల నేతృత్వంలోని ఆఫ్గ‌నిస్తాన్ స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు గ‌తంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పెద్ద ఎత్తున భార‌త దేశానికి చెందిన హిందువులు, సిక్కులు ఆఫ్గ‌నిస్తాన్ నుంచి ఇండియాకు తిరిగి వ‌చ్చారు.

సిక్కు ప్రార్థ‌నా మందిరాన్ని టార్గెట్ చేయ‌డం పెద్ద ఎత్తున ప్ర‌పంచ వ్యాప్తంగా సిక్కులు, హిందువుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఎప్పుడైతే తాలిబ‌న్లు ఆఫ్గనిస్తాన్ పై ప‌ట్టు సాధించారో వారికి ప్ర‌పంచం నుంచి మ‌ద్ద‌తు క‌రువైంది.

ఒకానొక స‌మ‌యంలో అండ‌గా ఉంటూ వ‌చ్చిన పాకిస్తాన్ ను సైతం తాలిబ‌న్లు ప‌క్క‌న పెట్టారు. కానీ క‌రవు కాలంలో, క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో భార‌త దేశం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో సాయం చేసింది తాలిబ‌న్ల‌కు.

దీంతో పెద్ద ఎత్తున భార‌త దేశం ప‌ట్ల వారు త‌మ వ్య‌తిరేకమైన వైఖ‌రిని మార్చుకున్నారు. భార‌త్ చేసిన సాయం ప‌ట్ల వారు బ‌హిరంగంగానే ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తాజాగా ఆఫ్గ‌నిస్తాన్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ద‌య‌చేసి మీకు సెక్యూరిటీ క‌ల్పించే బాధ్య‌త మాది. ప‌రిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి.

మీరు నిర‌భ్యంత‌రంగా ఆఫ్గ‌నిస్తాన్ కు(Taliban Urges Hindus Sikhs) రావ‌చ్చ‌ని తాలిబ‌న్లు కోరారు. ఈ మేర‌కు వారు ఓ ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఉగ్ర దాడిలో దెబ్బ తిన్న కాబూల్ లోని గురు ద్వారా కార్తే ప‌ర్వాన్ ను పున‌రుద్ద‌రించాల‌ని తాలిబ‌న్ నేతృత్వంలోని ఆఫ్గ‌నిస్తాన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు తాలిబ‌న్ రాష్ట్ర మంత్రి కార్యాల‌యం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ల‌ర్ ముల్లా అబ్దుల్ వాసీ జూలై 24న ఆఫ్గ‌నిస్తాన్ హిందూ, సిక్కు కౌన్సిల్ స‌భ్యుల‌తో స‌మావేశ‌మైన‌ట్లు ఆఫ్గ‌నిస్తాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫీస్ వెల్ల‌డించింది.

ఈ విష‌యాన్ని ట్వీట్ చేసింది.

Also Read : రాష్ట్ర‌ప‌తికి దేశాధినేత‌ల కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!