Tamili sai : గత కొంత కాలం నుంచీ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు సీఎం కేసీఆర్ కు పొసగడం లేదు. వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది.
ఇంకో వైపు దేశ రాజకీయాలను శాసించాలని అనుకుంటున్న కేసీఆర్ ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ ఈసారి గవర్నర్ ప్రమేయం లేకుండానే సమావేశాలు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గవర్నర్.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తమిళి సై సౌందర రాజన్ (Tamili sai )తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పని తీరును పరిశీలించాలని నిర్ణయించారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తే ప్రజలు ఎన్నుకోబడిన సభ్యులు చట్ట సభ సాక్షిగా చర్చించే హక్కును కోల్పోతారని స్పష్టం చేశారు. అయితే సాంకేతిక పరంగా చూస్తే గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాక పోవచ్చని తెలిపారు.
తన ప్రసంగం లేక పోయినప్పటికీ బడ్జెట్ సమర్పణను స్వాగతిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సభ సమావేశం కానుండడం, ఈ తరుణంలో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నెట్టింట్లో ఇది వైరల్ గా మారింది. ఏం జరుగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : దేశానికి కొత్త నాయకత్వం అవసరం