Tamilisai Soundara Rajan : గవర్నర్ తమిళిసై షాకింగ్ కామెంట్స్
అభివృద్ది అంటే హైదరాబాదేనా
Tamilisai Soundara Rajan : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అభివృద్ది అంటే ఒక్క హైదరాబాద్ కానే కాదన్నారు. మారుమూల పల్లెలు సైతం బాగు పడాలని అప్పుడే తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ది చెందినట్లు అని పేర్కొన్నారు.
ఇంకా మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని అన్నారు. వాటిపై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ చేరితేనే అభివృద్ధి అన్నది సాధ్యమవుతుందని చెప్పారు.
విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు రంగాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. చదువు మనిషికి సంస్కారం నేర్పుతుందని, ఎలా బతకాలో కూడా చెబుతుందన్నారు. ఇవాళ అపారమైన అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే చదువు కోవాలని సూచించారు. ఆరోగ్య పరంగా తెలంగాణలో ఇంకా ఆస్పత్రులు, వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావాలని సూచించారు.
చెంచులు, ఆదివాసీలు సైతం సమాజంలో భాగం అయ్యేలా కృషి చేయాలని స్పష్టం చేశారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundara Rajan). టెక్నాలజీ ఒక్కటే అన్నింటిని పరిష్కరిస్తుందని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. మిగతా రంగాలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు గవర్నర్.
Also Read : CM Siddaramaiah