Tammineni Veerabhadram : భట్టి ఓడి పోవడం ఖాయం
సీపీఎం నేత వీరభద్రం
Tammineni Veerabhadram : ఖమ్మం – సీపీఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ను టార్గెట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓడి పోయే సీట్లలో మొట్ట మొదటి స్థానం మధిరనేనని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Tammineni Veerabhadram Slams Bhatti Vikramarka
సీపీఎంతో ఎందుకు పొత్తు పెట్టు కోలేదని భట్టి విక్రమార్క బాధ పడడం ఖాయమన్నారు తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram). ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సీపీఎం, సీపీఐ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని భావించారు. కానీ సీట్ల కేటాయింపులో సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. చివరకు ఒంటరిగా బరిలోకి దిగింది సీపీఎం.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సీపీఎం ప్రభావం ఉంటుంది. ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే ఛాన్స్ లేక పోలేదు. అందుకే తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు మల్లు భట్టి విక్రమార్కపై. పాలేరు నుంచి వీరభద్రం బరిలోకి దిగారు. మధిరలో కూడా సీపీఎం అభ్యర్థి నిలిచారు.
Also Read : Revanth Reddy : సీమాంధ్ర పాలనే బావుండేది