Monitoring Cheetahs : చిరుతల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Monitoring Cheetahs : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కునో నేషనల్ పార్క్ లో చిరుతలను పర్యవేక్షించేందుకు గాను 9 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ప్రతి నెలా ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. చిరుతల(Monitoring Cheetahs) ఆవాసాలను ఎకో టూరిజానికి తెరిచేందుకు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించాలని భావిస్తున్నారు.
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చిరుతలను పర్యవేక్షించేందుకు 9 మందితో కూడిన టాస్క్ ఫోర్స్ ను రూపొందించింది. ఈ చిరుతలను మధ్య ప్రదేశ్ లోని ఎకో పార్కు కు తీసుకు వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజును పురస్కరించుకుని వాటిని పార్కులోకి విడుదల చేశారు.
ఈ చిరుతలను గత నెలలో నమీబియా నుండి తీసుకు వచ్చారు. చిరుతల ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడం, వాటి పురోగతిని సమీక్షించడం టాస్క్ ఫోర్స్ చేస్తుంది. అటవీ, వెటర్నరీ అధికారుల ప్రోటోకాల్ లకు కట్టుబడి ఉండటం. మధ్య ప్రదేశ్ అటవీ శాఖ , నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) కలిసి పర్యవేక్షించనున్నాయి.
ఇక ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో రిటైర్డ్ ప్రిన్సపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ , చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ , అలోక్ కుమార్ , అమిత్ మల్లిక్ , ఇన్స్ పెక్టర్ జనరల్ , ఎన్టీసీఏ, డాక్టర్ విష్ణు ప్రియ ఉన్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. చిరుతలను చూసేందుకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలనే దానిపై కూడా టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుంది.
Also Read : వెట్రిమారన్ కామెంట్స్ కలకలం