TDP MP’s Protest : బాబు అరెస్ట్ పై ఎంపీల నిరసన
టీడీపీ చీఫ్ పై ఏపీ సర్కార్ కుట్ర
TDP MP’s Protest : న్యూఢిల్లీ – టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో పాటు టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యూఢిల్లీలో నిరసన చేపట్టారు. ప్ల కార్డులతో తమ ఆందోళన వ్యక్తం చేశారు.
TDP MP’s Protest Viral
ఈ సందర్భంగా ఎంపీలు పెద్ద ఎత్తున ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని, జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఏపీ స్కిల్ స్కామ్ లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు.
కానీ కావాలని చంద్రబాబును ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు సత్యం బయట పడుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కాగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
ఏపీ స్కిల్ స్కామ్ లో రూ. 371 కోట్లు చేతులు మారాయని, షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు తన వారికి అప్పగించాడని ఆరోపించింది. చంద్రబాబు పీఏ తో పాటు నారా లోకేష్ కు సన్నిహితుడైన కిలారి రాజేష్ కు ఇందులో కీలక పాత్ర ఉందని ఆరోపించింది సీఐడీ. బాబు కేసుకు సంబంధించి రేపు విచారణ జరగనుంది.
Also Read : Suresh Pattnaik : టీమిండియా సైకత శిల్పం వైరల్