TDP Protest : ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం అక్రమమని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ పార్టీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆనాడు దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాటం చేశారని, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు, అభివృద్ది కోసం పాటు పడ్డారని కొనియాడారు. ఏపీ సర్కార్ కావాలని కక్ష సాధింపు ధోరణితో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు కింజారపు అచ్చెన్నాయుడు.
TDP Protest Viral
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాబుకు మద్దతు లభిస్తోందన్నారు. మోత మోగించిన , విజిల్స్ వేసిన టీడీపీ(TDP) నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
జగన్ కు పిచ్చి పట్టిందని ఆరోపించారు. రాబోయే కాలంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, తమకు 160 సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు. వైసీపీకి కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయని జోష్యం చెప్పారు కింజారపు అచ్చెన్నాయుడు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
Also Read : Telangana Election : ఎన్నికల కౌంట్ డౌన్ షురూ