Adimulapu Suresh : మంత్రి కామెంట్స్ టీచర్స్ సీరియస్
గూగుల్ కన్నా గూగుల్ మిన్న
Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్ – ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాద్దాంతానికి దారితీశాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం జగన్ రెడ్డి తన భార్యతో కలిసి లండన్ పర్యటనకు బయలు దేరి వెళ్లారు. ఈ తరుణంలో ఎంతో బాధ్యతగా ఉండాల్సిన మంత్రి అదుపు తప్పి నోరు జారారు.
Adimulapu Suresh Comments Viral
ఆయన టీచర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా నిర్వహించే టీచర్స్ డే సందర్బంగా మంత్రి కామెంట్ చేశారు. గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ స్పష్టం చేశారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు. మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్ తో తమను పోల్చడం ఏమిటి అంటూ మండిపడ్డారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి తమ పట్ల సపోర్ట్ గా మాట్లాడాల్సింది పోయి తమ శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు టీచర్లు.
గురు పూజోత్సవం రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. కేబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రి నోరు జారడం, సోయి లేకుండా మాట్లాడటాన్ని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నానరు.
Also Read : Chandra Babu Naidu : రేపో ఎల్లుండో నన్ను అరెస్ట్ చేస్తారు