Team India Viral : టీమ్ ఇండియా వైరల్
ప్రతిపక్షాల మీటింగ్ పై ఫోకస్
Team India Viral : టీమ్ ఇండియా అంటే ఇదేదో క్రికెట్ జట్టు అనుకుంటే పొరపాటు పడినట్లే. మోదీ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఏర్పాటైన పేరు ఇండియా అలయెన్స్. ఇండియా కీలక సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా జరుగుతోంది. ఈ కీలక భేటీ రెండు రోజుల పాటు కొనసాగనుంది.
Team India Viral in Mumbai
దేశంలో పేరు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. మొత్తం ఇండియా కూటమిలో 28 పార్టీలకు సంబంధించి 68 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరికీ మరాఠా మాజీ సీఎం, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే(Uddhav Thackeray) విందు ఏర్పాటు చేశారు.
గతంలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న నేతలంతా ఒక జట్టుగా ఏర్పడ్డారు. అంతిమంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కలిసికట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా , మోదీని గద్దె దించేందుకు బరిలోకి దిగాలని తీర్మానం చేశారు.
ఇవాళ కూడా ఇండియా కూటమికి ఎవరు కన్వీనర్ గా ఉండాలనేది నిర్ణయించనున్నారు. అంతే కాకుండా కూటమికి సంబంధించి లోగో, విధి విధానాలు కూడా ఖరారు చేయనున్నారు. తాజాగా ఇండియా కూటమికి సంబంధించి నేతలంతా కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇండియా టీం ఏ మేరకు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Also Read : IND vs PAK Asia Cup 2023 : దాయాదుల పోరుపై ఉత్కంఠ