Teenmar Mallanna : మల్లన్న స్వరం వెంకన్న జపం
కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్
Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ జర్నలిస్ట్ గా గుర్తింపు పొందారు. క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ వచ్చారు. ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అధికార పార్టీని, సీఎం కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు.
Teenmar Mallanna Comment
ఆ వెంటనే ఆయనపై దాడులు జరిగాయి. కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఉన్నట్టుండి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ వేదికగా తమ పార్టీకి మంచి వాయిస్ ఉంటుందని పేర్కొంది ఆ పార్టీ. కానీ ఏమైందో ఏమో కానీ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
మేడ్చల్ టికెట్ ను ఆశించారు. చివరకు హైకమాండ్ పార్టీకి సంబంధించి ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించింది. ఈ సందర్బంగా తొలుత జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. గతంలో రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని, బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు మల్లన్న(Teenmar Mallanna).
కానీ ఇదే మల్లన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిని గెలిపించాలని కోరడం, ప్రచారం చేయడంపై పలువురు నిలదీస్తున్నారు.
Also Read : Balram Naik : ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే