Teesta Setalvad : తీస్తా సెత‌ల్వాద్ కు బెయిల్ మంజూరు

గుజ‌రాత్ అల్ల‌ర్ల తీర్పు త‌ర్వాత అరెస్ట్

Teesta Setalvad : ప్ర‌ముఖ ఉద్య‌మ‌కారిణి తీస్తా సెత‌ల్వాద్ కు బెయిల్ మంజూరైంది. గుజ‌రాత్ అల్ల‌ర్ల తీర్పు త‌ర్వాత కుట్ర కింద అరెస్ట్ చేశారు. సెత‌ల్వాద్ ను విచారించేందుకు పోలీసుల‌కు ఏడు రోజుల స‌మ‌యం ఉంద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

అప్ప‌టి నుండి ఆమె జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉంది. ఆమె బెయిల్ పొందేందుకు అర్హురాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై విస్తృత ద‌ర్యాప్తు కోసం ఆమె చేసిన అభ్య‌ర్థ‌న‌ను తోసి పుచ్చిన త‌ర్వాత తీస్తా సెత‌ల్వాద్(Teesta Setalvad) ను అరెస్ట్ చేశారు.

2002 లో గుజ‌రాత్ అల్ల‌ర్ల త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌రిచేందుకు కుట్ర ప‌న్నారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జూన్ నుండి జైలులో ఉన్నారు. ఆమె మ‌ధ్యంత‌ర బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

పిటిష‌న్ ను విచారించిన అనంత‌రం సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా ఆమె హైకోర్టును ఆశ్ర‌యించింది.

కానీ ఆగ‌స్టు 3న ఆరు వారాల త‌ర్వాత విష‌యాన్ని పోస్ట్ చేసింది. అత్యున్న‌త న్యాయ‌స్థానం ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. రెగ్యుల‌ర్ బెయిల్ కోసం ఆమె వేసిన పిటిష‌న్ గుజ‌రాత్ హైకోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంది.

ఈ విష‌యం పెండింగ్ లో ఉన్న స‌మ‌యంలో హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ కోసం చేసిన అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి యుయు ల‌లిత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

2002-2012 కాలానికి సంబంధించిన ఆరోప‌ణ‌లు కాగా ఈ ఏడాది జూన్ 26న ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయ‌లేని కోర్టుపై ఎటువంటి నేరం లేదు.

Also Read : ‘రాజ‌ధాని ఎక్స్ ప్రెస్’ విందు ప‌సందు – ఇమ్నా

Leave A Reply

Your Email Id will not be published!