Tejashwi Yadav : ద్రౌప‌ది ముర్ము వాయిస్ విన‌లేదు – తేజ‌స్వి

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఆర్జేడీ నేత

Tejashwi Yadav : భారత దేశంలో అత్యున్న‌త ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి సంబంధించి ఈనెల 18న సోమ‌వారం ఎన్నిక జ‌ర‌గనుంది.

ఈ సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ త‌మ ఉమ్మడి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేసింది.

ఇక విప‌క్షాల నుంచి ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హాను బ‌రిలో నిల‌బెట్టింది.

అయితే ద్రౌప‌ది ముర్ముపై ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. విప‌క్షాల త‌ర‌పు అభ్య‌ర్థి సిన్హా త‌న వాయిస్ ను గ‌ట్టిగా వినిపిస్తున్నారని పేర్కొన్నారు.

తాను ఏం చేయాల‌ని అనుకుంటున్నాడో చెబుతున్నారు. కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌భుత్వం దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే తానే కరెక్ట్ అభ్య‌ర్థినంటూ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారని తేజ‌స్వి యాద‌వ్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా విసృతంగా ప‌ర్య‌టిస్తూ డెమోక్ర‌సీ ప్రాముఖ్య‌త గురించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని కొనియాడారు అయితే. భార‌త దేశానికి ర‌బ్బ‌ర్ స్టాంప్ అవ‌స‌రం లేద‌న్నారు.

రాజ్యాంగానికి కాప‌లా కుక్క లాగా ఉండే వ్య‌క్తి కావాలంటున్నారు య‌శ్వంత్ సిన్హా. కానీ అధికార పార్టీకి చెందిన నాయ‌కురాలు ఏ ఒక్క‌సారి మౌనం వీడి మాట్లాడిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

కేవ‌లం సంతకం కోస‌మే బీజేపీ ఆదివాసీ జ‌పం చేస్తోందంటూ ఆరోపించారు తేజ‌స్వి సూర్య‌. రాష్ట్ర‌ప‌తి దేశ సార్వ‌భౌత్వాన్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నించాలే త‌ప్పా త‌ను స్వేచ్ఛ‌ను కోల్పోకూడ‌ద‌న్నారు తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav).

Also Read : సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!