Tejashwi Yadav : ప్రజలను ఆదరించండి సేవ చేయండి – తేజస్వి
మంత్రులకు హిత బోధ చేసిన డిప్యూటీ సీఎం
Tejashwi Yadav : బీహార్ లో కొత్తగా డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ తరపున కేబినెట్ లో కొలువుతీరిన మంత్రులంతా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని వాటిని తెలుసుకుని నడుచు కోవాలని సూచించారు.
తాజాగా తన సోదరుడు నిర్వహించిన అధికారిక సమావేశంలో తన బావమరిది కూర్చోవడంపై తీవ్ర దుమారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తన మంత్రివర్గ సహచరులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎవరికీ కొత్త కార్లు వద్దని , సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు, బాధితులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు తేజస్వి యాదవ్(Tejashwi Yadav). పారదర్శకతకు పెద్ద పీట వేయాలన్నారు.
పువ్వులు, బొకేలకు బదులుగా పుస్తకాలు, పెన్నులు స్వీకరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలన్నారు డిప్యూటీ సీఎం. అందరికీ నమస్తే చెప్పండి. ప్రేమగా పలకరించాలని కోరారు మంత్రుల్ని.
ఇదిలా ఉండగా 17 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో కొనసాగిన పొత్తను కాదనుకున్నారు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయన ఉన్నట్టుండి ప్రతిపక్ష పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జత కట్టారు.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 31 మందికి కేబినెట్ లో చోటు కల్పించారు. కాగా అత్యధికంగా ఆర్జేడీ తేజస్వి యాదవ్ వర్గానికి మంత్రి పదవులు దక్కాయి.
మంత్రులు ఎలా ఉండాలో స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించాలని అంతే కాకుండా కార్మికులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు తమ పాదాలను తాకేందుకు అనుమతించవద్దని కోరారు తేజస్వి యాదవ్.
Also Read : కేజ్రీవాల్ ను చూసి కేంద్రం కంగారు