Tejashwi Yadav Slams : కేసులు..వేధింపులకు భయపడం – తేజస్వి
బీజేపీ సర్కార్ భగ్గుమన్న డిప్యూటీ సీఎం
Tejashwi Yadav Slams : ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav Slams) నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సర్కార్ ను తూర్పార బట్టారు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని మోదీ, అమిత్ షా అనుకుంటున్నారని కానీ వాళ్ల ఆటలు సాగవన్నారు. ఎలాంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు డిప్యూటీ సీఎం. అయితే గతంలో కంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ బీజేపీయేతర ప్రభుత్వాలను కావాలని కేంద్రం టార్గెట్ చేస్తోందంటూ మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని అదే దానిని సపోర్ట్ చేస్తే సత్య హరిశ్చంద్రులుగా కీర్తిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. లొంగక పోతే ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలను ప్రయోగిస్తున్నాయని ఆరోపించారు. మోదీ ది క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బీబీసీ ఆఫీసులపై దాడులకు పాల్పడిన ఐటీ ఎందుకని అదానీ గ్రూప్ పై సోదాలు చేపట్టలేదని ప్రశ్నించారు తేజస్వి యాదవ్.
ఎన్ని పాపాలు చేసినా పాపాత్ములు పుణ్యాత్ములుగా మారి పోతున్నారని ఇదేమి విచిత్రమో తనకు అర్థం కావడం లేదంటూ సెటైర్ వేశారు. బీహార్ రాజధాని పాట్నాలో సీపీఎం 11వ జనరల్ కన్వెన్షన్ లో తేజస్వి యాదవ్ మాట్లాడారు. ఇవాళ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. దీనిని అందరం కలిసి కాపాడు కోవాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం.
ఇవాళ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్న మైందని అన్నారు తేజస్వి యాదవ్.
Also Read : నగదు రహిత లావాదేవీలలో భారత్ టాప్