Tejasvi Surya : తేజ‌స్వి సూర్య సంచ‌ల‌న కామెంట్స్

అంజ‌నాంద్రి కొండ ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థలం

Tejasvi Surya : భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) ఎంపీ తేజ‌స్వి సూర్య సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. క‌ర్ణాట‌క (Karnataka) లోని అంజ‌నాద్రి కొండ హ‌నుమంతుడి స్వ‌స్థ‌ల‌మ‌ని ప్ర‌క‌టించారు.

ఆయ‌న బెంగ‌ళూరు (Bengaluru) సౌత్ నియోజ‌క‌వర్గానికి  ప్రాతినిధ్యం వ‌హించారు. పార్టీ (BJP) ఆధ్వ‌ర్యంలో భార‌త్ ద‌ర్శ‌న్ యాత్ర చేప‌ట్టారు. ఇందులో భాగంగా అంజ‌నాద్రి గుడిని సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా తేజ‌స్వి సూర్య (Tejasvi Surya)మాట్లాడారు. క‌ర్నాట‌క (Karnataka) లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా అనెగౌండి స‌మీపంలో అంజ‌నాద్రి కొండ ఆంజనేయుడు పుట్టిన స్థ‌లం అని చెప్పారు.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఏపీలోని తిరుమ‌ల క్షేత్రంలో హ‌నుమంతుడి పుట్టిన స్థ‌లం అని టీటీడీ (TTD) తీర్మానం చేశారు.

ఈ విష‌యంలో ఎవ‌రి వాద‌న‌లు వారివని పేర్కొన్నారు తేజ‌స్వి సూర్య‌ (Tejasvi Surya) . తాము ఎవ‌రినీ ద్వేషించ‌డం లేద‌న్నారు. వాల్మీకి రాసిన రామాయ‌ణం లో ఈ ప్రాంతం గురించి ప్ర‌స్తావించార‌ని వెల్ల‌డించారు తేజ‌స్వి సూర్య‌.

ఇదిలా ఉండ‌గా త‌మ ప్ర‌భుత్వం అంజ‌నాంద్రి కొండ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయించింద‌న్నారు. కాగా తిరుమ‌ల లోని అంజ‌నాద్రిపై ఉన్న జాబాలి తీర్థమే ఆంజ‌నేయుడి పుట్టిన స్థ‌ల‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

ఇదిలా ఉండ‌గా టీటీడీ (TTD) ఆధారాలు కూడా స‌మ‌ర్పించింది. ప్ర‌స్తుతం తేజ‌స్వి సూర్య చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం ఇంకా ముగియ లేదు. మ‌రో వివాదానికి తెర లేపారు ఎంపీ తేజ‌స్వి సూర్య‌. ప్ర‌స్తుతం హిజాబ్ అంశం సుప్రీంకోర్టులో న‌డుస్తోంది.

Also Read : కాంగ్రెస్ పార్టీ కీల‌క స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!