Tejasvi Surya : ద‌మ్ముంటే న‌న్ను నిషేధించండి

ఎంపీ తేజ‌స్వి సూర్య షాకింగ్ కామెంట్స్

Tejasvi Surya : క‌ర్ణాట‌క బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ త‌న మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో విద్వేషాల‌ను రెచ్చ గొడుతున్న విశ్వ హిందూ ప‌రిష‌త్ కు చెందిన బ‌జ‌రంగ్ ద‌ళ్ తో పాటు ఇస్లామిక్ ఉగ్ర‌వాద సంస్థ గా పేరు పొందిన పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే నిషేధం విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు తేజ‌స్వి యాద‌వ్. తాను బ‌జ‌రంగ్ న‌ని ద‌మ్ముంటే త‌న‌పై నిషేధం వేటు వేయాల‌ని స‌వాల్ విసిరారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ఈనెల 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 13న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ త‌రుణంలో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండ‌గా ఉగ్ర‌వాద సంస్థ సిమిపై నిషేధాన్ని సోనియా గాంధీ వ్య‌తిరేకించార‌ని మండిప‌డ్డారు మ‌రో బీజేపీ నేత సురేంద్ర జైన్. కాగా నేను బ‌జ‌రంగిని, నేను క‌న్న‌డిగుడిని , ఇది హ‌న్మంతుడు పుట్టిన భూమి. న‌న్ను నిషేధించే స‌త్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నిప్పులు చెరిగారు తేజ‌స్వి సూర్య‌(Tejasvi Surya).

Also Read : బీజేపీ ప్ర‌భుత్వం క‌ర్ణాట‌క‌కు శాపం

Leave A Reply

Your Email Id will not be published!