Liquor Record Sales : లిక్క‌ర్ అమ్మ‌కాల్లో తెలంగాణ టాప్

రూ. 34 వేల కోట్ల ఆదాయం

Liquor Record Sales : విద్య‌, వైద్యం ప‌క్క‌న పెట్టిన ప్ర‌భుత్వం మ‌ద్యంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంది. ఎక్క‌డ చూసినా బెల్టు షాపులు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. కేవ‌లం లిక్క‌ర్ అమ్మ‌కాల ద్వారా నే రాష్ట్రానికి ఈ ఏడాది 2022లో ఊహించ‌ని రీతిలో ఆదాయం స‌మ‌కూరింది.

ఏకంగా మ‌ద్యం అమ్మ‌కాల నుంచే రూ. 34 వేల కోట్లు రావ‌డంతో ప్ర‌భుత్వం తెగ ముచ్చ‌ట ప‌డుతోంది. మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించి, అభివృద్దికి బాట‌లు వేయాల్సిన ప్ర‌భుత్వం చివ‌ర‌కు లిక్క‌ర్ దందాకు దిగింది. ఒక ర‌కంగా రియ‌ల్ ఎస్టేట్ లో బ్రోక‌ర్ ప‌ని చేస్తోంది. ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 1 నుంచి డిసెంబ‌ర్ 30 దాకా ఈ అమ్మ‌కాలు(Liquor Record Sales) జ‌రిగాయ‌ని అధికారికంగా వెల్ల‌డించింది.

జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంది. రెండో స్థానంలో హైద‌రాబాద్ చేరితో మూడో స్థానంలో న‌ల్ల‌గొండ జిల్లా నిలిచింది. మొత్తంగా ఓ వైపు రైతు బంధు, ఇంకో వైపు పెన్ష‌న్ల పేరుతో ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్న స‌ర్కార్ రెండో వైపు లిక్క‌ర్ ను కావాల‌ని ఎగ‌దోస్తోంది. జ‌నాన్ని తాగేలా ప్రేరేపిస్తోంది.

విచిత్రం ఏమిటంటే మ‌ద్య‌మే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మార‌డం విషాదం. ప్ర‌తి ఏటా లిక్క‌ర్ అమ్మ‌కాల‌లో రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ వ‌స్తోంది తెలంగాణ స‌ర్కార్. 2014-2015 సంవ‌త్స‌రంలో రాష్ట్రానికి రూ. 10.88 కోట్ల ఆదాయం స‌మ‌కూరితే , 2018-19లో రూ. 20.85 వేల కోట్ల‌కు చేరింది. 2020-2021లో అది కాస్తా భారీగా పెరిగింది. ఏకంగా రూ. 27.28 కోట్ల‌కు చేరింది.

Also Read : కేసుల ప‌రిష్కారంపై ఫోక‌స్ పెట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!