Telangana Assembly Sessions : శాసనసభ సమావేశాలు 3 రోజులు
స్పష్టం చేసిన స్పీకర్ పోచారం
Telangana Assembly Sessions : చావు కబురు చల్లగా చెప్పారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. గురువారం తెలంగాణ శాసనసభ , శాసన మండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన ప్రజా ప్రతినిధులకు నివాళులు అర్పించారు(Telangana Assembly Sessions). వారి సేవలను గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలుపొందిన జి. సాయన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విజయ రామారావు కు కూడా ఘనంగా నివాళి అర్పించింది సభ.
Telangana Assembly Sessions Discussion
ఇదిలా ఉండగా సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ భేటీ జరిగింది. మంత్రులతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేవలం మూడు రోజుల పాటు మాత్రమే సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు స్పీకర్.
ప్రభుత్వం అందుకు సమ్మతంగా ఉందని , మిగతా కొన్ని రోజులు నిర్వహించాలంటే కుదరదని కుండ బద్దలు కొట్టారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ప్రతిపక్షాల సభ్యులు. ఇది సభా సాంప్రదాయం కాదన్నారు. మూడు రోజులలో ప్రజలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఎలా ప్రస్తావించాలని ప్రశ్నించారు. కనీసం 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తరపున భట్టి కోరారు. ఇదిలా ఉండగా ఈ సమావేశాల్లోనే కనీసం 10 కి పైగా బిల్లులు ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందని టాక్.
Also Read : Youth Congress Protest : యూత్ కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తం