Telangana Assembly : 14 నుంచి తెలంగాణ అసెంబ్లీ
15న స్పీకర్ ఎన్నిక
Telangana Assembly : హైదరాబాద్ – తెలంగాణలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పటికే సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు కొత్తగా మంత్రులుగా కొలువు తీరారు. ఇందులో భాగంగా రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది.
Telangana Assembly Starts from 14th December
ఈనెల 14 నుంచి తెలంగాణ(Telangana) శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 15న సభా పతిని ఎన్నకుంటారని తెలిపింది. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిర్వహించారు.
నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనతో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతకం చేయించారు. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 16 నుంచి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగిస్తారని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. ఈనెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపింది.
మరో వైపు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మంత్రి జూపల్లి కృష్ఱారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
Also Read : Kakani Govardhan Reddy : రామోజీ డైరెక్షన్ బాబు యాక్షన్