Telangana BJP Tribute : ‘కమలం’ అమరులకు వందనం
ఈటల, కిషన్ రెడ్డి నివాళులు
Telangana BJP Tribute : తెలంగాణలో బీజేపీ తన స్టాండ్ ఏమిటో ప్రజలకు చెప్పాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే డ్యామేజ్ అయిన దానిని కవర్ చేసుకునే పనిలో పడ్డది. బీజేపీ చీఫ్ గా నియమతులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆలయానికి వెళ్లారు. పూజలు చేశారు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు.
Telangana BJP Tribute To
తెలంగాణలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో త్రిముఖ పోటీ జరగనుంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం కావాలంటే పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత కిషన్ రెడ్డిపై ఉంది.
అమరులు లేక పోతే తెలంగాణ లేదు. 1969లో శ్రీపాదాచారి తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటే మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకాంతాచారి ఊపిరి పోశాడు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు ఆ బలిదానాల సాక్షిగా పవర్ ను అనుభవిస్తోందని ఆరోపించారు ఈటల రాజేందర్.
బీఆర్ఎస్ ,బీజేపీ రెండూ ఒక్కటి కాదని స్పష్టం చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉంది. ఏ మేరకు పార్టీని నడుపుతారనేది తేలాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు మొదలయ్యాయి. మొత్తంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చే పనిలో పడ్డాయి పార్టీలు.
Also Read : Raj Nath Singh : మణిపూర్ ఘటన బాధాకరం