Telangana Police Jobs : పోలీస్ శాఖలో కొలువుల మేళం
3,996 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
Telangana Police Jobs : తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడంలో చూపినంత శ్రద్ద భర్తీపై ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పటి వరకు అన్ని శాఖలలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ పర్మిషన్ ఇస్తోంది. తాజాగా పోలీస్ శాఖలో(Telangana Police Jobs) ఖాళీగా ఉన్న 3,996 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పులను ఆధారంగా చేసుకుని పోలీస్ శాఖలో మార్పులు చేయాలని సూచించింది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా , నేరాల తీరు కూడా మారుతున్న తరుణంలో వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని భర్తీ చేసేందుకు మొగ్గు చూపింది.
అందులో భాగంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించు కోవాలని కోరుకుంటోంది. ఈ మేరకు సిబ్బందిని నియమించు కోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే పెరిగి పోతున్న డ్రగ్స్ , గంజాయి, మద్యం కారణంగా చోటు చేసుకుంటున్న నేరాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున వివిధ విభాగాలలో ఉద్యోగులు అవసరం అవుతారని కేబినెట్ అభిప్రాయ పడింది.
ఇందులో భాగంగా సైబరాబాద్ , హైదరాబద్, కమాండ్ కంట్రోల్ సెంటర్ , నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , రాచకొండ కమిషనరేట్స్ , తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించంది. ఇందుకు సంబంధించి వెంటనే నియామక ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర హోం శాఖను ఆదేశించింది.
ఇదిలా ఉండగా పోలీస్ శాఖలో మరికొన్ని సదుపాయాలు కల్పించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఠాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం సై అన్నారు.
Also Read : గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి పచ్చ జెండా