Venu Prasad : పంజాబ్ రాష్ట్రంలో అఖండ విజయాన్ని నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రానికి సంబంధించి ప్రిన్సిపాల్ సెక్రటరీ (ముఖ్య కార్యదర్శి ) గా తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫసర్ వేణు ప్రసాద్(Venu Prasad) ను నియమించారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తన ఫోటో ఆఫీసులలో ఉండ కూడదని ఆదేశించారు. ప్రత్యేకించి భగత్ సింగ్ , అంబేద్కర్ ఫోటోలు పెట్టాలని ఆదేశించారు. అంతే కాకుండా ఊహించని రీతిలో ప్రతిపక్షాలకు బిగ్ షాక్ ఇచ్చారు. ఓడి పోయిన 122 మంది ఎమ్మెల్యేలకు ఉన్న భద్రతను తొలగించారు.
ఇక తాజాగా సిన్సియర్ అధికారిగా పేరొందిన వేణు ప్రసాద్ ను ఎంపిక చేయడం విస్తు పోయేలా చేసింది. ఇక వేణు ప్రసాద్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట. ఆయన పూర్తి పేరు అరిబండి వేణు ప్రసాద్. నేరేడు చర్ల మండలం పెంచికల్ దిన్నె ఊరు.
ప్రస్తుతం వేణు ప్రసాద్ పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆప్ పవర్ చేపట్టనున్న తరుణంలో కీలక పోస్టులో వేణు ప్రసాద్ ను నియమించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
విద్యుత్తు శాఖలో అవిభక్త కవలలకు జాబ్ ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు ఆయన. దీంతో వేణు ప్రసాద్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఉన్నత పదవిలో ఆయన కొలువు తీరడం పట్ల స్వంతూరులో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఊరు వాసులు.
Also Read : డిప్యూటీ స్పీకర్ వర్సెస్ ఎమ్మెల్యే