CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాబోయే 2024లో దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కానుంది. ఇవాళ టీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.
పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు మొత్తం 283 మంది హాజరవుతారు. ఇందులో జాతీయ పార్టీకి సంబంధించి తీర్మానం చేయనున్నారు. పార్టీ ప్రకటన తర్వాత దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గత కొంత కాలంగా వివిధ రాష్ట్రాలను పర్యటించారు కేసీఆర్(CM KCR). ఆయన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ , ఒడిశా, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలను పర్యటించారు. భారతీయ రాష్ట్ర సమితి అని పిలిచే అవకాశం ఉన్న పార్టీని ప్రారంభించేందుకు ఇవాళ మధ్యాహ్నం 1.19 గంటలకు ముహూర్తం నిర్ణయించారు.
అంతకు ముందు కేసీఆర్ ఆధ్వర్యంలో 33 జిల్లాల అధ్యక్షులతో భోజన సమావేశం నిర్వహించారు. జాతీయ రోడ్ మ్యాప్ పై పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన రోడ్ మ్యాప్ పై చర్చించారు. జాతీయ పార్టీ ఏర్పాటు , దాని విధానాల రూపకల్పన జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు కేసీఆర్.
పార్టీ కోసం రూ. 100 కోట్ల విలువైన 12 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్ ను కొనుగోలు చేశారు. ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నారో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దీనిని ఎంత మాత్రం సహించబోమంటూ స్పష్టం చేసింది బీజేపీ.
Also Read : మున్సిపాల్టీలకు రూ. 2 కోట్ల చొప్పున నజరానా