Telangana Congress Viral : బై బై కేసీఆర్..స్లోగన్ వైరల్
మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి
Telangana Congress : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల వార్ కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈనెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాలలో తాము కచ్చితంగా 80 నియోజకవర్గాలలో పక్కగా గెలుస్తామని అంటోంది కాంగ్రెస్ పార్టీ(Congress). ఇందుకు సంబంధించి రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీ కంటే ప్రచారంలో ,సోషల్ మీడియాలో ముందంజలో కొనసాగుతోంది.
Telangana Congress Comments on KCR
ఆ పార్టీ వెనుక వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గురించి ఓ నివేదిక అందజేసినట్లు సమాచారం.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే తో పాటు అగ్ర నేతలు జల్లెడ పడుతున్నారు. సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. అంతే కాదు సమావేశం, రోడ్ షోలు, సభలలో ప్రచారం ముగిసే సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా జనంతో అనిపిస్తున్నారు ..తాను కూడా అంటున్నారు బై బై కేసీఆర్ అని. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
Also Read : MLC Kavitha : కాంగ్రెస్ వల్లనే రైతు బంధుకు బ్రేక్