Telangana CS : వరద బాధిత జిల్లాలకు స్పెషలాఫీసర్స్
ప్రకటించిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి
Telangana CS : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయా జిల్లాల కలెక్టర్లను.
Telangana CS Says
సీఎం వరద పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ ఆదేశాల మేకు సీఎస్(Telangana CS) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు సహాయ సహకారాలు అందించేందుకు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న కృష్ణ ఆదిత్యను ములుగు జిల్లా కు స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. సెర్ప్ సిఇఓ గా ఉన్న పి. గౌతమ్ ను భూపాలపల్లి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించారు సీఎస్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న ముషారఫ్ అలీని నిర్మల్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ గా , పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ ను ప్రత్యేక అధికారిగా నియమించారు సీఎస్ శాంతి కుమారి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా ఉన్న హన్మంత రావును ఆసిఫాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించారు సీఎస్.
Also Read : India Protest : ఎంపీల వినూత్న నిరసన