Telangana Election Commission : నిఘా నీడలో పోలింగ్ కేంద్రాలు
భారీ ఎత్తున భారీ భద్రతా ఏర్పాట్లు
Telangana Election Commission : హైదరాబాద్ – ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ పర్వం ప్రారంభమైంది. ఇంకా కొన్ని గంటల సమయమే ఉన్నా సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరిని గెలిపిస్తుందనేది ఉత్కంఠను రేపుతోంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వికాస్ రాజ్ వెల్లడించారు. సైలెంట్ పీరియడ్ మొదలైందన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెబ్ కాస్ట్ ద్వారా కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
Telangana Election Commission with High Security
స్థానికేతరులు ఎవరు ఉండడానికి వీలు లేదన్నారు వికాస్ రాజ్. ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల అధికారులు వెళుతున్నారని తెలిపారు. మాక్ పోల్ కోసం 30న గురువారం ఉదయం 5.30 కల్లా పోలింగ్ ఏజెంట్లు రావాలని పేర్కొన్నారు సిఈవో.
ఈవీఎంలను పోలింగ్ ఏజెట్లను తాక కూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేలా చేశామని పేర్కొన్నారు. ఇప్పటి దాకా 27 వేల 178 మంది తమ విలువైన ఓటు వేశారని చెప్పారు వికాస్ రాజ్. ఎన్నికల విధుల్లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. 27 వేల 98 పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించే ప్రసక్తి లేదన్నారు.
Also Read : Buggana Rajendranath Reddy : రహదారులు ప్రగతికి చిహ్నాలు