Telangana Elections 2023 : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
నిమగ్నమైన రిటర్నింగ్ ఆఫీసర్స్
Telangana Elections 2023 : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికలు(Telangana Elections 2023) ముగిశాయి. పోలింగ్ పూర్తయింది. ఇక మిగిలింది కొన్ని గంటలు మాత్రమే. పోలింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 49 సెంటర్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాలలో జిల్లాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో వీటిని పర్యవేక్షిస్తున్నారు.
Telangana Elections 2023 Updates
మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీ ఎత్తున నగదు పట్టుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతను కొనసాగిస్తున్నట్లు తెలిపారు సీఈవో. ఇదిలా ఉండగా ఆయా సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు వికాస్ రాజ్.
Also Read : PM Modi : మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్