Telangana Budget 2023 : అంద‌రి ఆశ‌లు తెలంగాణ బ‌డ్జెట్ పైనే

ప్ర‌వేశ పెట్ట‌నున్న రాష్ట్ర స‌ర్కార్

Telangana Budget 2023 : త్వ‌ర‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌నే ప్ర‌చారం జోరందుకున్న త‌రుణంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ను ఫిబ్ర‌వ‌రి 6 సోమ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నుంది(Telangana Budget 2023) . ఇప్ప‌టికే భార‌త రాష్ట్ర స‌మితి చీఫ్‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు అలియాస్ కేసీఆర్ సార‌థ్యంలో రాష్ట్ర మంత్రివ‌ర్గం భేటీ అయ్యింది. ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్ పై ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏయే రంగాల‌కు ఎంతెంత ప్రాధాన్య‌త ఇవ్వాలి.

ఎన్ని కోట్లు కేటాయించాల‌నే దానిపై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు కొన‌సాగాయి. కాగా కేవ‌లం 10 నిమిషాల లోపే కేబినెట్ కొత్త బ‌డ్జెట్ కు ఆమోద ముద్ర వేసింది. ఇక నువ్వా నేనా అన్న రీతిలో నిన్న‌టి దాకా కొన‌సాగింది సీఎం కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ మ‌ధ్య వివాదం. చివ‌ర‌కు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం, ఆపై కోర్టు సుప్రీం గ‌వ‌ర్న‌రేనంటూ స్ప‌ష్టం చేయ‌డంతో గత్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం పూర్త‌యింది. ఇక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టాల్సి ఉంది.

మొత్తంగా ఇది ఎన్నిక‌ల బ‌డ్జెట్ గా ఉండ‌నుంద‌ని స‌మాచారం. 2022-2024 కు సంబంధించి వార్షిక బ‌డ్జెట్ దాదాపు 3 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌వేశ పెడుతుండ‌డంతో తాయిలాలు ఏమైనా ఉంటాయా అని జ‌నం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌ను సంతృప్తి చెందేలా సంక్షేమ రంగానికి అత్య‌ధికంగా నిధులు కేటాయించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా మ‌రోసారి ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

Also Read : తెలంగాణ‌లో జిమ్మిక్కులు ప‌ని చేయ‌వు

Leave A Reply

Your Email Id will not be published!