Telangana Formation : అంబరాన్ని తాకిన ఆవిర్భావ సంబురం
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
Telangana Formation : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురం అంబరాన్ని తాకాయి. జూన్ 2, 2014న సరిగ్గా ఇదే రోజు దేశంలో కొత్త రాష్ట్రం గా ఆవిర్భవించింది. ఇవాల్టితో తొమ్మిది ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రం ప్రగతి పథంలో ప్రయాణం చేస్తోంది. ఒకప్పుడు నీళ్లు లేక గోసపడిన తెలంగాణ(Telangana) ఇవాళ ఎక్కడ చూసినా నీళ్లతో కళకళ లాడుతున్నాది. నియామకాల విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. రాష్ట్రంలో ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు.
40 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. అమరులు చేసిన త్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ(Telangana) రాష్ట్రంగా రూపు దిద్దుకున్నది. 2001లో టీడీపీ నుంచి వీడి నేటి సీఎం కేసీఆర్ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. సంబండ వర్ణాలు, సకల జనులంతా ఏకమై తెలంగాణ నినాదమై ఉద్యమించారు. పోరాట పటిమను ప్రదర్శించారు. చివరకు కేంద్రం దిగి రాక తప్పలేదు. ఏది ఏమైనప్పటికీ దివంగత రాజకీయ నాయకుడు సూదిని జైపాల్ రెడ్డి చేసిన ప్రయత్నం , కొండా లక్ష్మణ్ బాపూజీ , కేశవ్ రావ్ జాదవ్ , కాళోజీ నారాయణ రావు ముఖ్య భూమికను పోషించారు. వాళ్లు ఇవాళ భౌతికంగా లేరు.
శరీరంలో తూటాను పెట్టుకుని ఊరూరా తిరిగాడు..పాటలు కట్టాడు..పాడుతూనే ఉన్నాడు ప్రజా యుద్ద నౌక గద్దర్. ఇక చెప్పుకుంటూ పోతే ఎందరో తమదైన రీతిలో పోరాటంలో భాగం పంచుకున్నారు. కానీ ఆశించిన ప్రయోజనం చేకూరలేదన్న అసంతృప్తి ఉంది. ఏర్పడిన రాష్ట్రం కొందరికే పరిమితమైందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Also Read : GVL Narasimha Rao