KTR : పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం
న్యూయార్క్ కాన్సులేట్ లో మంత్రి కేటీఆర్
KTR : తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నారు వ్యాపారవేత్తలను, ఔత్సాహికులను, కంపెనీలను. తాజాగా న్యూయార్క్ లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు కేటీఆర్.
ఈ సందర్బంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అమెరికాతో దగ్గరి అనుబంధం ఉందన్నారు. అంతే కాదు ఈ న్యూయార్క్ నగరం తనకు ఎంతో నేర్పిందన్నారు కేటీఆర్. తాను చదువుకున్న, తాను పని చేసిన ఈ సుందరమైన పట్టణం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అత్యంత గాఢమైన బంధం ఉందని స్పష్టం చేశారు. ఏదైనా వ్యాపారాన్ని స్థాపించేందుకు అవసరమైన అన్ని వనరులను, మౌలిక వసతులను కలిగి ఉందని చెప్పారు కేటీఆర్.
తెలంగాణను ఒక ఆదర్శనీయమైన ప్రాంతంగా తీర్చి దిద్దామని, ఈ ఘనత తమ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఎవరైనా అక్కడికి రావచ్చని, వారికి సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు కేటీఆర్.
ప్రగతి శీల పరిశ్రమ, స్నేహ పూర్వక విధానాలు, బలమైన ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థతో తెలంగాణ తన 14 ప్రాధాన్యత రంగాలలో విస్తృత అవకాశాలను అందిస్తుందని చెప్పారు. పెట్టుబడిదారులకు తమ రాష్ట్రం గేట్ వేగా ఉందని తెలిపారు కేటీఆర్.
Also Read : Vijayendra Saraswathi