Telangana Governer : కేసీఆర్ రాజీనామా ఆమోదం

ఆమోదించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

Telangana Governer : హైద‌రాబాద్ – భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్ , ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీని సాధించింది అధికారంలోకి వ‌చ్చింది. ఆ పార్టీకి 64 సీట్లు వ‌చ్చాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు కైవ‌సం చేసుకుంది.

Telangana Governer CM Resign Approved

ఇక హంగ్ వ‌స్తుంద‌ని ఆశించిన బీజేపీ భంగ ప‌డింది. చివ‌రి నిమిషం వ‌ర‌కు తాము తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని అనుకున్నారు కేసీఆర్. ప్ర‌జ‌ల‌కు దూరంగా పాల‌న సాగిస్తూ, అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన గులాబీ నేత‌ల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ వ‌చ్చారు సీఎం.

దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు కేసీఆర్ కు. ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే ఆయ‌న‌కు కేటాయించిన కాన్వాయ్ ను తీసేశారు డీజీపీ. రాజ్యాంగం ప్ర‌కారం ఎవ‌రైతే ఓడి పోయారో ఆ పార్టీకి సంబంధించిన సీఎం స్వ‌యంగా గ‌వ‌ర్న‌ర్(Telangana Governer) వ‌ద్ద‌కు వెళ్లి రాజీనామా ప‌త్రం ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ ఆయ‌న ఎవ‌రికీ చెప్ప‌కుండానే తాను ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు. ఇక రిజిగ్నేష‌న్ ప‌త్రాన్ని ఓఎస్డీ ద్వారా గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేశారు. వెంట‌నే ఆమోదించారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్.

Also Read : Telangana MLAs List : 119 నియోజ‌క‌వ‌ర్గాలు విజేత‌లు

Leave A Reply

Your Email Id will not be published!