Telangana Governer : మెగా డీఎస్సీ..టీఎస్సీఎస్సీ ప్రక్షాళన
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
Telangana Governer : హైదరాబాద్ – తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్(Tamilisai Soundararajan) కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రారంభమైన శాసన సభ, శాసన మండిలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో సంస్థలన్నీ ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Governer Comment
వ్యక్తిగత ఆరాధనలో సంస్థలు మునిగి తేలుతున్న ప్రజాస్వామ్యంలో ఇది శ్రేయస్కరం కాదన్నారు. ఇది భూస్వామ్య పాలన కాదన్నారు. గత సర్కార్ కేవలం ప్రచారానికే పరిమితమైందన్నారు. ఇక నుంచి ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని వాటి అభివృద్దికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.
6 నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని పేర్కొన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.
సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గవర్నర్ . ప్రజా వాణి కింద వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం భూమికి సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read : Smita Sabharwal : సచివాలయంలో స్మిత ప్రత్యక్షం