Telangana Governer : ఎన్నికల అవగాహన సభలో ఘాటు వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు

Telangana Governer : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై.. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రచారం చేసారు. ఎలక్షన్ సందర్భంగా ఓ అభ్యర్థి అన్నారని గవర్నర్ గుర్తు చేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు సూచించారు.

Telangana Governer Comment

జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల అవగాహన కార్యక్రమానికి గవర్నర్‌(Tamilisai Soundararajan) గౌరవ అతిథిగా హాజరయ్యారు. ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఓట్లను పొందాలని ప్రయత్నించడం పద్దతి కాదని, అలాంటి వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరినీ బలవంతంగా ఓటు వేయమని ఫోర్స్ చేయొద్దని అన్నారు. ఓటర్ల సంఖ్యను పెంచడానికి కేవలం ప్రకటనలు సరిపోవు. ఓటు అనేది ప్రతి ఓటరుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం. సజీవ ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని గవర్నర్ యువతకు సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. ఈవీఎం ఫీల్డ్‌లో ఓటు వేయ‌డానికి నోటా అనే ఆప్ష‌న్ ఉంది, అయితే దానిని నేను వ్యతిరేకిస్తాను. ఓటర్లు మంచి అభ్యర్థులను ఎన్నుకుంటేనే సుపరిపాలన సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అభ్యర్థికి ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని అన్న మాట బాధించిందని, అలాంటి మాటలకు లొంగవద్దని ఓటర్లకు సూచించారు.

గతేడాది నవంబర్ 28న సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో గెలిస్తే విజయయాత్రగా వస్తానని, లేదంటే సవ యాత్రకి రావాలని మాట్లాడారు. దండం పెడతా , కాళ్ళు పట్టుకుంటా అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి బెదిరించిన ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.

Also Read : AP EX Minister Balineni : బాలినేని వ్యాఖ్యలకు భగ్గుమన్న జగన్ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!