CM KCR : దేశానికి ఆద‌ర్శం తెలంగాణ ప్ర‌భుత్వం

ప్ర‌జ‌లు ప‌ని తీరుకు ప‌ట్ట‌డం ఖాయం

CM KCR : కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకు పోతోంద‌ని , దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా మారింద‌న్నారు సీఎం కేసీఆర్(CM KCR). మంగ‌ళ‌వారం నాగ‌ర్ క‌ర్నూల్ లో కేసీఆర్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నూత‌నంగా నిర్మించిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యం, పోలీస్ సూప‌రింటెండెంట్ ఆఫీస్, నూత‌న క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల‌ను సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కొల్లాపూర్ చౌర‌స్తా వ‌ద్ద ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. గ‌తంలో నాయ‌కులు, పాల‌కులు మాట‌ల‌తో మాయ చేశార‌ని ఎద్దేవా చేశారు. కానీ తాను వ‌చ్చాక తెలంగాణ‌ను అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉండేలా చేశాన‌ని చెప్పారు సీఎం.

ఒక‌ప్పుడు నెర్రెలు బారిన భూములు ఉండేవ‌ని, నీళ్ల‌కు, క‌రెంట్ కు క‌ట‌క‌ట లాడే వార‌ని కానీ ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఆకు ప‌చ్చ‌ని తెలంగాణ క‌నిపోస్తోంద‌న్నారు. ఇదంతా త‌న వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు. విజ‌న్ లేని నాయ‌కులు, ముందు చూపు లేన‌టువంటి ద‌ద్ద‌మ్మ‌లు కొంద‌రు అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని వారిని ప‌ట్టించు కోవ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. రాబోయే రాజ్యం మ‌న‌దేన‌ని తానే మూడోసారి సీఎంగా ప‌ట్టాభిషేకం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

మొత్తం 119 సీట్ల‌కు గాను 110 సీట్లు రావ‌డం ప‌క్కా అని రాసి పెట్టుకోవాల‌ని స‌వాల్ విసిరారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌ల‌ల్లో తేలి యాడుతున్నాయ‌ని, కొంద‌రు ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామ‌ని అంటున్నార‌ని ఆ స‌న్నాసుల‌ను అడ్ర‌స్ లేకుండా చేయాల‌ని, వాళ్ల‌ను బంగాళా ఖాతంలోకి విసిరి వేయాల‌న్నారు కేసీఆర్.

Also Read : Tej Pratap Yadav : బీజేపీ వంతెన‌ను కూల్చేసింది – తేజ ప్ర‌తాప్

Leave A Reply

Your Email Id will not be published!