SERP Pay Scale : సెర్ప్ ఉద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్

పే స్కేల్ వ‌ర్తింపు చేస్తూ జీవో జారీ

SERP Pay Scale : తెలంగాణ గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ (సెర్ప్) లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది రాష్ట్ర ప్ర‌భుత్వం. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు పే స్కేల్(SERP Pay Scale) ను వ‌ర్తింప చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఇవో 11 ద్వారా ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. కొత్త‌గా వేత‌న స్కేల్ ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. గ్రామీణాభివృద్ది శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా దీనిపై సంత‌కం చేశారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ఇవి అమ‌లులోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు.

క‌నిష్టంగా రూ. 19 వేల రూపాయ‌ల నుంచి గ‌రిష్టంగా రూ. 59 వేలు , గ‌రిష్టంగా రూ. 51 వేల నుంచి రూ. 1.28 లక్ష‌ల వ‌ర‌కు వేత‌నాలు పెర‌గ‌నున్నాయి. 

రాష్ట్రంలో ప‌ని చేస్తున్న 3,978 నుంచి వివిధ విభాగాల‌లో , కేడ‌ర్ ల‌లో ప‌ని చేస్తున్న వారికి వ‌ర్తింప చేయ‌నున్నాయి ఈ కొత్త వేత‌నాలు. గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ (SERP Pay Scale) ప్ర‌ధానంగా ఆయా గ్రామీణ ప్రాంతాల‌లో మ‌హిళ‌ల కోసం ప‌ని చేస్తుంది. ఈ శాఖ‌లో అడిష‌న‌ల్ డీఆర్డీవో, డీపీఎం, ఎపీఎం, సీసీలు, ఎంఎస్ సీసీలు, డ్రైవ‌ర్లు, ఆఫీస్ స‌బార్డినేట్లు, ప‌రిపాల‌న అసిస్టెంట్లు, ప్రాజెక్టు సెక్ర‌ట‌రీలు, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్లతో పాటు కాంట్రాక్టు ప‌ద్ద‌తిన ప‌ని చేస్తున్న వారు కూడా ఉన్నారు. 

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ప‌ని చేస్తున్న వారికి రూ. 19,000 నుంచి 58,850 పే స్కేల్ ఉండ‌నుంది. ఇక ఇంట‌ర్ అర్హ‌త‌తో ప‌ని చేస్తున్న 338 మ‌దికి రూ. 22,240 నుంచి 67,300 పే స్కేలు ఉంటుంది. డిగ్రీ అర్హ‌త‌తో ఉన్న వారికి రూ. 24,280 నుంచి 72,850 స్కేల్ అమ‌ల‌వుతుంది. పీజీ అర్హ‌త‌తో ఉన్న వారికి రూ. 32,810 నుంచి 96,890 స్కేల్ వ‌ర్తించ‌నుంది. జిల్ ప్రాజెక్టు మేనేజ‌ర్ల‌కు రూ. 42,300 నుంచి రూ. 1,15,270 స్కేల్ , ప్రాజెక్టు మేనేజ‌ర్లుగా రూ. 51,320 నుంచి రూ. 1, 27, 310 వేత‌న స్కేల్ వర్తిస్తుంది.

Also Read : గ‌వ‌ర్నర్ ను క‌లిసిన ప్ర‌వీణ్ కుమార్

Leave A Reply

Your Email Id will not be published!