Telangana Governor : వరదలపై రాజకీయం చేయొద్దు – తమిళిసై
రాష్ట్ర సర్కార్ పై మరోసారి కామెంట్స్
Telangana Governor : తెలంగాణ సర్కార్ , రాజ్ భవన్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. 15వ రాష్ట్రపతిగా కొలువు తీరిన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Telangana Governor).
అనంతరం మీడియాతో మాట్లాడారు గవర్నర్. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఓ వైపు బాధితులు సాయం కోసం చూస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి భరోసా కల్పించడం అన్నది నా బాధ్యత.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు గవర్నర్. విచిత్రం ఏమిటంటే వరదలపై రాజకీయం చేయడం తగదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తి వివరాలు తనకు అందజేశారని చెప్పారు.
తాను కూడా రాష్ట్రంలో జరిగిన నష్టం అంచనా గురించి నివేదికను కేంద్రానికి అందజేశానని వెల్లడించారు తమిళిసై సౌందర రాజన్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగానే వచ్చాయన్నారు.
ఇది పక్కన పెడితే తాను ప్రజల మనిషినని మరోసారి స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి పైకి వచ్చాను. ప్రజల బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏమిటో తనకు తెలుసన్నారు.
అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. నేను ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు గవర్నర్. ఈ దేశంలో ఎవరైనా ప్రధాని కావచ్చని ద్రౌపది ముర్ము నిరూపించారన్నారు.
తాను ఆమె కింద పని చేయడం సంతోషంగా భావిస్తున్నట్లు చెప్పారు. వరదల సమయంలో కలెక్టర్ కూడా రాలేదన్నారు.తాను రాజ్ భవన్ కు పరిమితం కానని, ప్రజల మధ్య ఉండడం, వారికి సేవ చేయడాన్ని తాను ఎక్కువగా కోరుకుంటానని చెప్పారు.
Also Read : త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని