Telangana Govt : ‘ప్రజాపాలన’ లో దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్
'ప్రజాపాలన' లో దరఖాస్తు చేసుకున్న వారు జాగ్రత్త
Telangana Govt : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు.
Telangana Govt Comment
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల అమలు కోసమే ఈ కార్యక్రమం చేపట్టారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సుతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. మరియు చేయూత రూ. 2500 ఆర్థిక సహాయం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. హామీల అమలు కోసం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అధికారులతో పాటు మంత్రులు పాల్గొంటారు. ఎంపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపరిపాలనను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అభయ హస్తం కోసం దరఖాస్తు చేసుకునే వారిని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ చేసి మీకు రేషన్ కార్డు, ఇల్లు మంజూరయ్యాయని చెప్పి, మేము మీ ఫోన్ నంబర్‌కు OTPని పంపాము, ఆ OTPని మాకు చెప్పండి అంటూ కాల్స్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా నకిలీదని, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియను ప్రారంభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు కానీ, ఓటీపీని కానీ ఎవరికీ చెప్పవద్దని సూచించారు. ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Also Read : Bengal ED Case : సోదాలు జరిపిన ఈడీ అధికారులు దాడి చేసారంటూ ఎఫ్ఐఆర్ నమోదు