Telangana Govt : పోలింగ్ రోజు సెలవు
ప్రకటించిన ప్రభుత్వం
Telangana Govt : హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనతో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు చేసింది ఈసీ.
Telangana Govt Orders
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు గాను ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది ఈసీ. ఇదే సమయంలో విలువైన ఓటు ఉపయోగించేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించింది. ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ఈ సెలవుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt). అయితే పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యా సంస్థలకు నవంబర్ 29తో పాటు 30న కూడా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 3 కోట్ల 27 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించకోనున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరో వైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సెక్యూరిటీ పెంచారు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.5 కోట్లు