Anjani Kumar DGP : ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
Anjani Kumar DGP : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31తో రాష్ట్ర డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో ఇంఛార్జ్ డీజీపీగా 1995వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీ కుమార్(Anjani Kumar DGP) ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది గురువారం.
ఇక ఏసీబీ డైరెక్టర్ జనరల్ పదవికి హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవి గుప్తాను ఎంపిక చేసింది. ఆయన స్థానంలో ఖాళీ అయిన పోస్ట్ లో అడిషనల్ డీజీపీ గా ఉన్న డాక్టర్ జితేంద్రకు అప్పగించింది ప్రభుత్వం. అంతే కాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు జైళ్ళ శాఖకు సంబంధించి డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రస్తుతం ఇంఛార్జ్ డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ స్థానంలో రాచకొండ పోలీస్ కమిషనర్ గా ఉన్న మహేష్ భగవత్ ను సీఐడీ అడిషనల్ డీజీపీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక 1997 బ్యాచ్ కు చెందిన దేవేంద్ర సింగ్ చౌహాన్ ను రాచకొండ కమిషనర్ గా ప్రమోషన్ ఇచ్చింది.
మరో వైపు పీ అండ్ ఎల్ అడిషనల్ డీజీపీగా ఉన్న 1997 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ జైన్ ను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక అంజనీ కుమార్ ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నారు. పాట్నా పూర్వ విద్యార్థి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఉత్తమ హార్స్ రైడర్ గా పేరు పొందారు. డిసెంబర్ 25, 2021న యాంటీ కరప్షన్ బ్యూరోకు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. మార్చి 12, 2018లో కమీషనర్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు.
లా అండ్ ఆర్డర్ కు అదనపు డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. అదనపు పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. నిజామాబాద్ రేంజ్ పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్నారు. గ్రేహౌండ్స్ చీఫ్ గా కూడా ఏపీ, తెలంగాణ కు పని చేశారు అంజనీ కుమార్.
Also Read : 31న పదవీ విరమణ చేస్తున్నా – డీజీపీ